‘జ్ఞాన, వ్యాకరణ, ఆధ్యాత్మిక’ రంగాలలో నడిచే ‘అమరకోశం’ అమరేశం రాజేశ్వరశర్మ. అటు ప్రాచీన భారతీయ ధర్మశాస్త్రాలు, ఇతిహాసాలు, వాఙ్మయాలలోను, ఇటు ఆధునిక జీవన విలువలు, విధానాలలోను మన తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని అద్భుతంగా ఎగురవేసిన ధన్యజీవి. శతమానానికి చేరువై కూడా నవయువకునివలె తనకు ప్రీతికరమైన వృత్తిధర్మాన్ని త్రికరణశుద్ధిగా సమాజసేవా దృక్పథంతో మాత్రమే నిన్నమొన్నటి వరకూ నిష్ఫలోపేతంగా నిర్వర్తిస్తూ వచ్చిన గొప్ప ఆదర్శమూర్తి. వయోసంబంధ అనారోగ్యభారం వల్ల ఇటీవలె భౌతికంగా దూరమైన అమరేశం వారి జీవిత విశేషాలను ఎంతో లబ్ధప్రతిష్ఠులు, వారి ప్రియశిష్యులు అయిన శలాక రఘనాథశర్మ ‘విజయక్రాంతి’ కోసం ప్రత్యేకించి అందించడం సంతోషదాయకం. విలువైన శలాక వారి వ్యాసంతోపాటు రెండు దశాబ్దాల క్రితమే రాసిన తన ఆత్మకథలో ఆనాటి జీవన పరిస్థితులు, దుస్థితులను ఎంతో సరళంగా, భావోద్వేగంగా అమరేశం వారు అందించారు. వాటిలోని కొన్ని సంఘటనలనూ ఇక్కడ చదవండి.
ఎడిటర్