calender_icon.png 26 March, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి

25-03-2025 07:01:30 PM

దర్శక, నిర్మాత దండ నాయకుల సురేష్ కుమార్.. 

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆధ్యాత్మిక మార్గంలో నడిచి భగవంతుని కృపకు పాత్రులు కావాలని దర్శక, నిర్మాత దండనాయకుల సురేష్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ వీరంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ మాల దీక్షపరుల ఆహ్వానం మేరకు భిక్ష కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేస్లాపూర్ వీరంజనేయ స్వామి ఆలయ విశిష్టతను గురించి భక్తులకు వివరించారు. అనంతరం అలయ కమిటి ఆధ్వర్యంలో నాగబాల సురేష్ కుమార్ ను ఆంజనేయ స్వామి చిత్ర పటం బహుకరించి, శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అలయ కమిటి అధ్యక్షులు ధర్మపురి వెంకటేశ్వర్లు, పిన్న వివేక్, గడ్డల వెంకటేష్, సుధాకర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.