10-04-2025 12:00:00 AM
కేర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నిర్వహణ
హైదరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని కేర్ హాస్పిటల్స్ ప్రత్యేక కార్యక్రమంగా ‘వాక్ ఫర్ ఎ హెల్తీ బిగినింగ్’ అనే నడకను చార్మినార్ వద్ద బుధవారం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థులుగా ఏపీ మాజీ డీజీపీ అన్వర్ ఉల్ హు దా, హైదరాబాద్ సిటీ మాజీ డీసీపీ కె. బా బురావు, కార్పొరేటర్ సయ్యద్ సుహైల్ ఖా ద్రీ, నాంపల్లి కేర్ హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ సమీ, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అమన్ సల్వాన్, మెడికల్ సూ పరింటెండెంట్ డాక్టర్ ఆనంద్, అనస్తీషియా నిపుణుడు డాక్టర్ ఇర్ఫాన్, సేల్స్, మార్కెటిం గ్ హెడ్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ వాక్‌లో స్థానికవాసులు, డాక్టర్లు, నాయకు లు పాల్గొని, చార్మినార్ చుట్టూ నడిచి, ప్రజలంతా కలసి ఆరోగ్యంగా ఉండాలనే సందే శాన్ని అందించారు. అన్వర్ ఉల్ హుదా మా ట్లాడుతూ.. మన చరిత్రకు గుర్తుగా నిలిచే చా ర్మినార్ వద్ద ఇలాంటి ఆరోగ్య నడక చాలా గొప్ప విషయమన్నారు. కార్పొరేటర్ సయ్య ద్ సుహైల్ ఖాద్రీ మాట్లాడుతూ.. కేర్ హాస్పిటల్స్ ప్రజల ఆరోగ్యంపై మంచి దృష్టి పెట్ట డం అభినందనీయమన్నారు. నాంపల్లి కేర్ హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ సమీ మాట్లాడుతూ.. చార్మినార్ ఒక బలానికి చిహ్నం. ఇక్కడి నుంచే మన ఆరోగ్య ప్ర యాణం ప్రారంభించడమే సరైన మార్గమన్నారు. కాగా కేర్ హాస్పిటల్స్ తమ మెంబ ర్షిప్ కార్డ్ ‘సంఘం’ను ప్రారంభించింది.