calender_icon.png 15 May, 2025 | 7:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెంగాల్‌లో ‘వక్ఫ్’ మంటలు

13-04-2025 12:50:25 AM

* అల్లర్లలో ముగ్గురు మృతి

*118 మంది అరెస్ట్ 

*ఇంటర్నెట్ నిలిపివేత 

*వక్ఫ్ చట్టాన్ని అమలు చేసేదే లేదన్న సీఎం మమతా బెనర్జీ

*కేంద్ర బలగాలను దించండి: కోల్‌కతా హైకోర్టు

కోల్‌కతా, ఏప్రిల్ 12: వక్ఫ్ (సవరణ): చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్, మాల్డా, సౌత్ 24 పరగణా లు, హుగ్లీ జిల్లాల్లో ఓ వర్గం వారు చేసిన నిరసనల్లో హింస చెలరేగింది. ఈ హింసకు సం బంధించి ఇప్పటి వరకు 118 మందిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పోలీస్ వాహనాలతో సహా ఇతర వాహనాలకు కూడా నిప్పు పెట్టారు. శనివారం ఉదయం కూడా ఈ ప్రాంతాల్లో టెన్షన్ వాతావరణమే కనిపించింది. ముర్షీదాబాద్ జిల్లాలో ని సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. 

తండ్రీకొడుకు హత్య!

ఈ నిరసనల్లో మొత్తం ముగ్గురు ప్రాణా లు కోల్పోయారు. ఇద్దరు అల్లర్లలో చనిపో గా, ఒకరు కాల్పుల్లో మరణించినట్టు లా అం డ్ ఆర్డర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ జావేద్ షమీమ్ ప్రకటించారు. ముర్షీదాబాద్ జిల్లా సంసేర్‌గంజ్ ప్రాంతంలో తండ్రీ, కొడుకులు మరణించినట్టు ఐపీఎస్ ఆఫీసర్ వెల్లడించారు. ఈ ఇద్దరూ తమ ఇంటిలో కత్తిపోట్లకు గురై ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు నూతన వక్ఫ్ చట్టాన్ని బెంగాల్‌లో అమలు చేసే ప్రసక్తే లేదని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.

రాజకీయాల కోసం అల్లర్లకు పాల్పడొద్దు. అలా చేసేవారు సమాజానికి ప్రమాదకరం. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలుంటాయి. రాజకీయ లబ్ధికోసం మతాన్ని దుర్వినియోగం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటువంటి పార్టీల పట్ల జాగ్రత్తగా ఉండండి. మీరంతా వ్యతిరేకిస్తున్న చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో బెం గాల్‌లో అమలు చేయబోం’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కలకత్తా హైకోర్టులోని స్పెషల్ బెంచ్ ఈ హింసపై స్పందిస్తూ.. జంగీపూర్‌లో కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశించింది.