ఎంపీ డీకే అరుణ హాజరు
హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి): వక్ఫ్ బోర్డు సవరణల బిల్లు 2024పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) అధ్యయనం పూర్తయింది. ఢిల్లీ పార్లమెంట్ భవనంలో జేపీసీ చైర్మెన్ జగదాంభికా పాల్ అధ్యక్షతన బుధవారం కీలక భేటీ జరిగింది. ఈ భేటీలో మహబూబ్‌నగర్ ఎంపీ, జేపీసీ సభ్యురాలు డీకే అరుణ పాల్గొన్నారు. ఈ బిల్లులో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరణలకు జేపీసీ సభ్యులు ఆమోదం తెలిపారు. త్వరలో జేపీసీ తన నివేదికను పార్లమెంట్‌కు అందజేయనుంది.