13-02-2025 01:51:59 AM
రెండు కిడ్నీలు పాడవడంతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శైలజ
కామారెడ్డి, ఫిబ్రవరి 12 (విజయ క్రాంతి), అప్పన్న హస్తం కోసం ఓ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి 13 సంవత్సరాల కూతురు కు రెండు కిడ్నీలు పాడయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అసలే పేదరికం కుటుంబం కావడంతో ఆస్పత్రి ఖర్చులు సరిపోవడం లేదు. ఇప్పటికే రెండు లక్షలు ఖర్చు చేశా మని తమకు స్తోమత లేదని ఆవేదన చెందుతున్నారు.
ఎవరైనా అప్పన్న హస్తం అందిస్తే ప్రాణాలతో గట్టెకుతుందని భావిస్తున్నారు. మనసున్న మహారాజులు స్పందించి తమకు తోచిన ఆర్థిక సాయం అందించి తమ కూతురు ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం లాడేగాం గ్రామానికి చెందిన నిరుపేదలు అయినా కంగ్టి శివాజీ కూతురు కంగ్టి శైలజ 13 సంవత్సరాలు పాపకు రెండు కిడ్నీలు పనిచేయకపో వడంతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేయడం జరిగింది.
ఇప్పుడు ప్రస్తుతం ఐసీయూలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది.ఇప్పటివరకు 2 లక్షల వరకు ఖర్చు అయింది.వైద్యం నిమిత్తం డాక్టర్స్ చాలా ఖర్చు అవుతుందని చెప్ప డంతో ఆపన్న హస్తం కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మీకు తోచినంత ఆర్థిక సాయం చేసి మా పాప శైలజ ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రులు వేడుకుంటు న్నారు. ఈ నెంబర్ కు 9652958465 ఫోన్ పే చేయాలనీ వేడుకుంటున్నారు. ఎమ్మెలే తోట లక్ష్మి కాంతారావు సహాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు.