calender_icon.png 26 October, 2024 | 11:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నా..

16-07-2024 12:10:00 AM

రహస్య గోరక్.. ప్రస్తుతం తెలుగులో ‘ఆరాధన’, తమిళ చిత్రం ‘అరాట్టు’లో నటిస్తోంది. మరికొన్ని ప్రాజెక్టులకు సైతం ఆమె సైన్ చేసింది. ‘ఆకాశమంత ప్రేమ’, ‘బాయ్స్ ఇన్ స్కూల్’ వంటి షార్ట్ ఫిల్మ్‌లో నటించిన ఈ బ్యూటీ 2019లో ‘రాజావారు రాణిగారు’ సినిమాతో తొలిసారి వెండితెరపై మెరిసింది. అలా ఆ సినిమాలో తాను ఫస్ట్ టైమ్ బిగ్ స్క్రీన్ షేర్ చేసుకున్న యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరంతోనే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోందీ హైదరాబాదీ అందం. ఔను, రహస్యకిరణ్ మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయింది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ‘రాజావారు రాణిగారు’ చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారగా, గత మార్చిలో ఈ జంట పూలుపండ్ల వేడుక కూడా పూర్తయింది.

తాజాగా పెళ్లి తేదీని స్వయానా రహస్య గోరక్ వెల్లడించింది. సోమవారం కిరణ్ పుట్టిన రోజు కావటంతో బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఆయనకు కాబోయే శ్రీమతి రహస్య ఓ రొమాంటిక్ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ‘రాజావారు రాణిగారు’ సమయం నుంచి నిశ్చితార్థం రోజు వరకు వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలతో రూపొందిన ఈ ప్రత్యేక వీడియోకు ఆసక్తికర క్యాప్షన్ కూడా పెట్టింది. ‘హ్యాపీ బర్త్ డే కిరణ్ అబ్బవరం. మరో 38 రోజుల్లో నిన్ను.. మై హస్బెండ్ అని పిలిచేందుకు ఆశగా ఎదురుచూస్తున్నా..’ అంటూ రాసుకొచ్చింది రహస్య. ఈ పోస్ట్‌ను చూస్తున్న అభిమానులు కాబోయే వధూవరులకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరో ముప్పు ఎనిమిది రోజులంటే ఈ ‘రాజావారు రాణిగారు’ దాంపత్య జీవితం అనే సామ్రాజ్యాన్ని ఏలేందుకు ఖాయమైన ముహూర్తపు తేదీ ఆగస్టు 22 అని తెలుస్తోంది.