calender_icon.png 20 January, 2025 | 9:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజిస్ట్రేషన్ల కోసం నిరీక్షణ..!

07-07-2024 02:26:49 AM

  • రోజుకు రెండు నుంచి ఐదు మాత్రమే 
  • ధరణి పనుల్లో తహసీల్దార్లు, సిబ్బంది బిజీబిజీ 
  • జనగామ తహసీల్ ఎదుట బాధితుల నిరసన

జనగామ, జూలై 6 (విజయక్రాంతి): తహసీల్దార్ కార్యాలయాల్లో కొన్ని రోజులుగా రిజిస్ట్రేషన్ సేవలకు అంతరాయం కలుగుతోంది. దీంతో భూ క్రయ, విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరణి సమస్యల పరిష్కారంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించడంతో ఆ ఎఫెక్ట్ రిజిస్ట్రేషన్ కార్యకలాపాలపై పడు తోంది. వారం రోజులుగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ రెవెన్యూ అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తు న్నారు. ధరణి సమస్యలపై సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు కొన్ని పనులు అప్పగిస్తున్నారు.

దీంతో వారం రోజులుగా తహసీల్దార్లతోపాటు సిబ్బంది ఆ పనుల్లో నిమగ్నం అయ్యారు. జనగామ ఆర్డీవో కార్యాలయంలో ధరణి సమస్యలపై విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కువ సమయం అక్కడే గడుపు తుండటంతో తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు సమయానికి కావడం లేదు. సాధారణంగా జనగామ తహసీల్దార్ కార్యాలయంలో రోజుకు 15 నుంచి 20 రిజిస్ట్రేష న్లు అవుతుంటాయి. కానీ, గత ౩ రోజులుగా రోజుకు కేవలం 2 నుంచి 5 రిజిస్ట్రేష న్లు మాత్రమే అవుతున్నట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. స్లాట్ బుక్ చేసుకుని తీరా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాక తహసీల్దార్ లేకపోవడం తో వారికి మరో తేదీ ఇస్తున్నారు. ఎన్నో ప నులు వదులుకుని, సుదూర ప్రాంతాల నుం చి స్లాట్ బుక్ చేసుకుని వస్తున్న వారిపై వ్యయప్రయాసాల భారం పడుతోంది. ఈ సమస్య జిల్లాలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లోనూ ఉందని ప్రజలు చెబుతున్నారు.

బాధితుల నిరసన

రిజిస్ట్రేషన్ల కోసం మూడు రోజులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టు తిరుగుతున్న పలువురు జనగామ తహ సీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనతెలిపారు. జనగామ మండలంలోని పెం బర్తి, పెద్దపహాడ్, పెద్దరాంచర్ల, శామీర్‌పేట, గానుగుపహాడ్ తదితర గ్రామాల నుంచి శని వారం రిజిస్ట్రేషన్ల కోసం సుమారు 25 మం ది వచ్చారు. మూడు రోజులుగా తమను తిప్పించుకుంటున్నారని ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తమ పనులన్నీ వదులుకుని రిజిస్ట్రేషన్ల కోసం వస్తే రేపు, మాపంటూ తిప్పించు

కుంటున్నారని వాపోయారు. తహసీల్దార్ వెంకన్న స్పందిస్తూ.. తమకు ధరణి పనులు అప్పగించడంతో ఆర్డీవో కార్యాలయంలో విధులు నిర్వహిస్తామని, దీంతో రిజిస్ట్రేషన్లు ఆలస్యం అవుతున్నాయన్నారు.