calender_icon.png 22 October, 2024 | 2:57 PM

రిలేషన్ కోసం ఎదురుచూస్తున్నా

19-10-2024 12:00:00 AM

సమయం దొరికితే చాలు శ్రుతిహాసన్ సామాజిక మాధ్యమాల్లో కాలం గడిపేస్తూ ఉంటారు. నెటిజన్లు ఎలాంటి ప్రశ్నలు అడిగినా కూడా విసుక్కోకుండా సమాధానం ఇస్తుంటారు. ప్రస్తుతం అడవి శేష్ కథానాయకుడిగా రూపొందుతున్న  ‘డకాయిట్’ చిత్రంలో శ్రుతి హాసన్ నటిస్తున్నారు. ఇది కాకుండా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో వస్తున్న ‘కూలీ’, సలార్ సీక్వెల్ ‘సలార్ శౌర్యంగపర్వం’లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం విరామం దొరికిందో ఏమో కానీ సోషల్ మీడియాలో వాలిపోయారు. ఇక శ్రుతి కనిపిస్తే నెటిజన్లు ఊరుకుం టారా? ‘మీరు సింగిలా.. రిలేషన్‌లో ఉన్నారా?’ అంటూ ప్రశ్నలు గుప్పించారు. దానికి శ్రుతి తనకు అలాంటి ప్రశ్నలు నచ్చవు కానీ అంటూనే సమాధానమిచ్చారు. “ఈ తరహా ప్రశ్నలు నచ్చవు కానీ చెబుతున్నా. నేనిప్పుడు సింగిలే. ప్రస్తుతానికి అయితే పనిలో బిజీ. రిలేషన్ కోసం ఎదురు చూస్తున్నా. జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా” అని తెలిపారు.