calender_icon.png 23 October, 2024 | 9:57 AM

నడుము ఒంపుల్లో..

10-07-2024 12:05:00 AM

‘లోఫర్’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ. ఇటీవలే ‘కల్కి2898ఏడీ’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు యూత్ మొత్తం దిశ నడుము అందాలను చూస్తూ ‘చిట్టి నడుమునే చూస్తున్నా.. చిత్రహింసతో చస్తున్నా’ అనీ.. ‘నడుము చూస్తే నయాగర ఫాల్సూ...’ అనీ.. నడుము చుట్టూ తిరిగే ఎవర్ గ్రీన్ పాటలను పాడుకుంటున్నారు. దిశ నడుము చూస్తూ ఆమెకు సంబంధం లేని పాటలెందుకు పాడుతున్నారో తెలిస్తే మీరూ ఆ పాటలందుకోకుండా ఉండలేరు! విషయమేమిటంటే.. ఇటీవల ‘పీడీ’ అనే టాటూతో వార్తల్లో నిలిచింది దిశ.

దీనికి అర్థం ఏమిటన్న దానిపై అంతా ఆరా తీస్తూ ఎవరికి తోచిన అర్థాలను వారు చెప్తూ వచ్చారు. ‘ప్రభాస్ డార్లింగ్’ అయి ఉండొచ్చు అని కూడా కొందరి ఉవాచ. ‘పీడీ’ సంగతి అటుంచితే.. తన శరీరంపై మళ్లీ ఓ కొత్త టాటూ వేయించుకొంది దిశ. ఈ ఫొటోలతోపాటు ‘కల్కి’లో ప్రభాస్‌తో తన అనుభవాన్ని తెలియజేస్తూ వీడియోను ఇన్‌స్టాలోకి వదిలింది. ఫొటోల్లో దిశా పటానీ నడుము ఒంపుల్లో అర్థం కాకుండా ఉన్న టాటూను చూసి నెటిజన్లంతా తమ మెదళ్లకు పనిపెట్టారు.

మొత్తానికైతే ఈ ముద్దుగుమ్మ చిట్టి నడుముపై ఉన్న టాటూపై శోధనలో తేలిందేమింటే.. అది ‘హీబ్రా’ భాష అని! ఇజ్రాయెల్, ఆసియా, ఆఫ్రికా మధ్య ఉండే కొన్ని దేశాల్లోని ఈ భాష వ్యవహారంలో ఉందని కనిపెట్టగలిగారు. ‘అతను నమ్మే ప్రతీదీ పొందవచ్చు’ అనేది ఆ టాటూ అర్థమన్న విషయాన్నీ శోధించి సాధించగలిగారు. మొత్తానికి దిశా పటానీ నడుము పైనున్న రాతలకు అర్థం తెలిసిన క్షణాన ఆమె అభిమానుల్లో పట్టరాని ఆనందం కనిపిస్తోంది!