10-02-2025 05:47:04 PM
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్...
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న సిబ్బందికి పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. సోమవారం కార్మికులతో కలిసి కలెక్టరేట్ ఏవో మధుకర్ కు వినతిపత్రం అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆసిఫాబాద్, కాగజ్ నగర్, బెజ్జూర్, తీర్యానీ, వాంకిడి, జైనూర్ మండలాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ సిబ్బందికి గత ఏడు నెలలుగా వేతనాలు చెల్లించకుండా కాంట్రాక్టర్, సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. వేతనాలు చెల్లించకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు దివాకర్, కార్మికులు రజిత, పుష్ప, పద్మ, సాయి, నరేష్, తిరుమల, మీనాక్షి తదితరులున్నారు.