హైదరాబాద్ : గ్రామపంచాయతీల కార్మికుల పెండింగ్ జీతాలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రాష్ట్రంలోని మల్టీపర్పస్ వర్కర్ల పెండింగ్ జీతాల కోసం ప్రభుత్వం రూ.150 కోట్లు విడుదల చేసింది. 29,676 కార్మికులకు మే నెల వరకు చెల్లించాల్సిన జీతాలకు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.