గజ్వేల్, అక్టోబర్ 6: మున్సిపాలిటీలలో మెప్మా పరిధిలో పనిచేస్తున్న రిసోర్స్‌పర్సన్ (ఆర్పీ)లకు జీవో నంబర్ 60 ప్రకారం వేతనాలు, బీమా సౌకర్యం కల్పించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆర్పీలతో కలిసి ఆదివారం గజ్వేల్‌లో నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కేవలం రూ.6వేల గౌరవ వేతనమిస్తూ వెట్టిచాకిరీ చేయిస్తున్నారని అన్నారు.
ప్రభుత్వ సర్వేలు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం అనేక రకాలుగా ఆర్పీలను వినియోగించుకుంటున్నారని అన్నారు. రూ.19,500 వేతనం ఇవ్వాలని, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా గజ్వేల్ ఆర్పీల సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా ఎల్లయ్య, అధ్యక్షులుగా సుభద్ర, ప్రధాన కార్యదర్శిగా కల్పన, శాధికారిగామనోహరి, ఉపాధ్యక్షులుగా పద్మ, వరకుమారి, సహాయ కార్యదర్శులుగా సంధ్య, పావని, కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.