calender_icon.png 25 January, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హమాలీల కూలీ రేట్లు పెంచాలి

24-01-2025 06:16:01 PM

ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి...

ఆదిలాబాద్ (విజయక్రాంతి): సి.డబ్ల్యూ.సి గోదాములో పని చేస్తున్న హమాలి కార్మికులకు ప్రస్తుత కాలంలో పెరుగుతున్నటువంటి నిత్యవసర వస్తువులకు అనుగుణంగా ఎగుమతి, దిగుమతి రేట్లును పెంచాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్ర దేవేందర్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ లోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాం ఎదుట శుక్రవారం హమాలీలతో కలిసి ఏఐటీయూసీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా సిర్ర దేవేందర్ మాట్లాడుతూ... పాత టెండర్ కాలం ముగిసి కొత్త టెండర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో హమాలి రేట్లు పెంచాలన్నారు. లేని పక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామన్నారు. ఇప్పటికే సంబంధిత గోదాం డిఎం, కార్పొరేషన్ కమిషనర్ లకు లెటర్ రాసి కార్మికులకు న్యాయం చేకూర్చే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో హమాలీలు S.K. దస్తగిర్, అన్నపూర్ణే సంబాజి, అబ్దుల్ ఖాలం, గోపాల్, వసంత్ చౌహన్, సిందే అమృత్, గంగాధర్, కపిల్, వాగ్మరే మహాదవ్ తదితరులు పాల్గొన్నారు.