calender_icon.png 30 October, 2024 | 2:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేఓసిలో పెరిగిన డ్రైవర్ల వేతనాలు..

30-10-2024 11:29:49 AM

ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  ఇల్లందు నియోజకవర్గం పరిధిలోని టేకులపల్లి మండలం సింగరేణి కోయగూడెం ఉపరితలగనిలో టిప్పర్ డ్రైవర్ల వేతనాలు పెరిగాయి. కేఓసీ నుంచి  బిపిఎల్, నవభారత్, తడికలపూడి ఇంకా వివిధ ప్రాంతాలకు టిప్పర్ల ద్వారా బొగ్గు సరఫరా చేస్తున్న డ్రైవర్లకు వేతనాలు పెరిగాయని తెలంగాణ ప్రగతిశీల మోటార్ మరియు ఆటో వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి నాగేశ్వరరావు ఐఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు డి ప్రసాద్ మోటార్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు డి రామ్మోహన్ రావు తెలిపారు.

బుధవారం కోయగూడెం టిప్పర్ డ్రైవర్లతో టేకులపల్లిలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. కార్మికులు సమిష్టిగా, సంఘటితంగా ఉద్యమించడం మూలాన వేతనాలు పెంచుకోగలిగామని వారు అన్నారు. గత జీతం మాస్టర్ కు రూ. 550  ఉండగా నేడు రూ. 610  పెంచుకున్నామని తెలిపారు. బేటా రూ.150 ఉండగా రూ.180 గా ట్రిప్పు మామూలు రూ.130 నుంచి రూ.150, రూ.230 నుంచి రూ. 270 గా పెంచుకున్నట్లు తెలిపారు. షెడ్డు మాములు గతంలో రూ.500 ఉండగా దానిని రూ. 600 పెంచుకున్నట్లు వారు తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతభత్యాలు డ్రైవర్లకు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్లీనరు లేనట్లయితే క్లీనర్ జీతము సగము డ్రైవర్ కు ఇచ్చే విధంగా ఒప్పందం జరిగినట్లు తెలిపారు.

ఈ ఒప్పందం 29.10.2024 నుంచి 28.10.2025 వరకు అనగా సంవత్సరం వరకు అగ్రిమెంట్ కాలంగా నిర్ణయించినట్లు వివరించారు. ఈ ఒప్పందంలో టిప్పర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు కోరం సురేందర్, అసోసియేషన్ అధ్యక్షులు నరసింహారావు, వెంకట్, బాలకృష్ణ, మోహన్ పాల్గొనగా, ఐఎఫ్టియు నాయకులు తోడేటి నాగేశ్వరరావు, కొక్కు సారంగపాణి, డి ప్రసాద్, డి.మోహన్ రావు, ఎండి. రాసుద్దీన్, మల్లికార్జునరావు, ఏఐటీయూసీ నాయకులు దేవరకొండ శంకర్, ఐ ఎన్ టి యు సి నాయకులు ఎస్ కే యాకుబ్ అలీ, తదితరులు పాల్గొన్నారు. ఈ ఒప్పందాన్ని టిప్పర్ ఓనర్ లు అమలు చేయాలని కోరారు. ఈ జనరల్ బాడీ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి కల్తి వెంకటేశ్వర్లు, డ్రైవర్లు, నాయకులు భద్రం, సమ్మయ్య, ముతేష్, నాగేందర్, రవి, మధు సతీష్ తదితరులు పాల్గొన్నారు.