calender_icon.png 29 November, 2024 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల పోరాట ఫలితమే ఛార్జీల పెంపు

28-11-2024 09:54:58 PM

నిర్మల్,(విజయక్రాంతి): మధ్యాహ్న భోజన కార్మికులకు ఛార్జీలు పెంచాలని తాము చేసిన పోరాటాల వల్లనే ఛార్జీలు పెరిగాయని మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ముఖ్య రమేష్ అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలోని టీఎన్జీవో కార్యాలయంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం చార్జీలు పెంచడం హర్షణీయమే అయినప్పటికీ ప్రతినెల బిల్లులు చెల్లించాలని, గౌరవ వేతనాన్ని అందించాలని, వంటశాలలను నిర్మించాలని, ఉచితంగా గ్యాస్ సిలిండర్ను అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు