calender_icon.png 3 February, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘వేతన’ పెంపు?

03-02-2025 01:42:17 AM

  1. కొత్త పన్ను విధానంతో మరింత లబ్ధి 
  2. పెరగనున్న మధ్యతరగతి వేతనాలు?
  3. రూ. 12 లక్షల వరకు నో ట్యాక్స్‌తో ఖజానాకు భారీ లోటు 
  4. పరోక్ష పన్నులపై కేంద్రం భారీ ఆశలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: నిర్మలమ్మ పద్దులో మధ్యతరగతి వేతన జీవులకు ఊరట కల్పి స్తూ రూ. 12 లక్షల వరకు ఆదాయంపై ఎటువంటి పన్ను లేదని మినహాయింపునిచ్చారు. ఈ విధానం వల్ల ప్రభుత్వానికి ఏటా రూ. లక్ష వరకు లోటు ఏర్పడతుందని ఆర్థిక వేత్త లు అభిప్రాయపడుతున్నారు.

ఇంత పెద్ద ఎత్తున లోటు అని తెలిసినా ఎన్డీయే సర్కా రు పన్ను మినహాయింపు నిర్ణయాన్ని తీసుకోవడం సాహసమనే చెప్పాలి. కానీ ఇలా రూ. 12 లక్షల ఆదాయం వరకు పన్ను లేకుండా చేయడం వల్ల మధ్యతరగతి ప్రజల చేతిలో ఎక్కువ డబ్బు మిగిలేలా చేశారు.

తద్వారా వారి కొనుగోలు శక్తి పెరిగి.. వారు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయనున్నట్లు ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త పన్ను శ్లాబులో రూ. 24 లక్షల వారికి 30 శాతం పన్ను విధించనున్నారు. పాత పన్ను విధానంలో ఈ మొత్తం రూ. 15 లక్షలు మాత్రమే. 

కొత్త ఉద్యోగాలు.. పెరగనున్న జీతాలు

ఇలా అనేక మంది ఎక్కువగా ఖర్చు చేయడం వల్ల వివిధ రంగాల్లో మరిన్ని కొత్త కంపెనీలు పుట్టుకొచ్చి కొత్త ఉద్యోగాల సృష్టికి కారణం అవుతుంది. అంతే కాకుండా డిమాండ్ పెరిగి వేతనాలు కూడా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అందుకోసమే ప్రభుత్వం ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం కోసమే రూ. 12 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపునిచ్చినట్లు సమాచారం.

దేశ జీడీపీ 60 శాతం మేర కొనుగోలు శక్తి మీదే ఆధారపడడం కూడా కేంద్రం ఈ నిర్ణయం తీసుకునేందుకు ఓ కారణంగా తెలుస్తోంది. ఇలా ప్రజల కొనుగోలు శక్తిని పెంచి తద్వా రా పరోక్ష పన్నుల రూపంలో ఆదాయం సమకూర్చుకోవాలని కేంద్రం చూస్తున్నట్లు సమాచారం. కేంద్రం ఆలోచన ఫలితాలు ఇచ్చేందుకు నాలుగైదేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. 

కార్పొరేట్లకు కూడా సాయం.. 

కేంద్రం తీసుకున్న రూ. 12 లక్షల ఆదా యం వరకు పన్ను మినహాయింపు అనేది కేవలం మధ్య తరగతి వారికి మాత్రమే కాకుండా కార్పొరేట్ వర్గాలకు కూడా సాయం చేయనుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం నిర్ణయం వల్ల మధ్య తరగతి ప్రజల చేతిలో ఎక్కువ డబ్బులు ఉండి వారు వివిధ ఉత్పత్తులు కొనేందుకు ఉపకరిస్తుంది.

తద్వారా కార్పొరేట్లు తయారు చేసే ఉత్పత్తులకు గిరాకీ కూడా పెరుగుతుందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ నిర్ణయం పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. కొత్త ఉద్యోగాల సృష్టికి, వేతనాల పెంపుకు ఇది దోహదం చేస్తుంది’ అని ప్రముఖ బ్యాం కర్ అమితాబ్ తివారీ తెలిపారు. రూ. 1 లక్ష కోట్లు ప్రభుత్వానికి నష్టం అని ఆలోచించ డం కంటే ఈ నిర్ణయం ద్వారా జీఎస్టీ వసూళ్లు కూడా పెరుగుతాయని పలువురు ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. 

ప్రధాని గుండెల్లో..

మధ్య తరగతి వర్గాలకు పన్ను విషయంలో భారీ ఊరట కల్పించిన తర్వాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ.. ‘మధ్యతరగతి ప్రజలు ఎల్లప్పుడూ ప్రధాని మోదీ గుండెల్లో ఉంటారు. ప్రతిపాదిత కొత్త పన్ను విధానం మధ్యతరగతి వర్గాల వారికి ఎంతో లబ్ధి చేకూరుస్తుంది. ప్రధాని సారధ్యంలోని ఎన్డీయే ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు తీసుకున్న ఈ నిర్ణయం అన్ని వర్గాల వారికి ఉపయోగపడుతుంది.

ఈ బడ్జెట్ ద్వారా ఆర్థిక మంత్రి ఒక్క టే చెప్పదల్చుకున్నారు. ఎక్కువ ఖర్చు చేసి.. భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చండి’ అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. హోం మంత్రి మాత్రమే కాక అనేక మంది ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.