గజ్వేల్,(విజయక్రాంతి): గజ్వేల్ ఆర్డీఓగా పీవీఎల్ చంద్రకళ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో గజ్వేల్ లో ఆర్డీవోగా పని చేసిన బన్సీలాల్ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఆర్డీవోగా బదిలీపై వెళ్లారు. హైదరాబాద్లో పబ్లికేషన్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో విధులు నిర్వహించిన వీవీఎల్ చంద్రకళ గజ్వేల్ ఆర్డీఓగా బదిలీ అయ్యారు. డివిజన్ లో శాఖపరమైన ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.