హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, హనుమకొండ, జోగులాం బ, వనపర్తి, మహబూబాబాద్, భద్రాచలం, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.