calender_icon.png 9 October, 2024 | 3:55 PM

యువకుడితో తీగల కృష్ణారెడ్డి బూతు పురాణం..

09-10-2024 12:57:26 PM

మనుమరాలు విషయంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి  ఓ యువకుడితో బూతు పురాణం

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఆడియో 

అమ్మాయి మరియు తీగల ఫ్యామిలీ టార్చర్ భరించలేక ఢిల్లీ లో తలదాచుకుని, చికిత్స చేయించుకుంటున్న నందీశ్వర్ రెడ్డి 

రంగారెడ్డి జిల్లా : మహేశ్వరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, టీకేఆర్ కాలేజ్ చైర్మన్ తీగల కృష్ణారెడ్డి బడంగ్పేట్ కి చెందిన నందీశ్వర్ రెడ్డి దూషించుకునే ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే తీగల కృష్ణారెడ్డి మనమరాలు త్రిషరెడ్డికి బడంగ్పేట్ కి  చెందిన నందీశ్వర్ రెడ్డి మధ్య గత కొంతకాలంగా ప్రేమాయణం సాగినట్టు తెలుస్తుంది. వారిద్దరి మధ్య దూరం ఏర్పడడంతో ఈ యొక్క వివాదానికి తెరలేపింది. 

ఈనెల 26 న యువకుడు నందీశ్వర్ రెడ్డి తల్లి మీర్పేట్ పోలీస్ స్టేషన్లో తీగల త్రిషారెడ్డి, తల్లి తీగల అనిత రెడ్డి మరియు తాత తీగల కృష్ణారెడ్డి పై ఫిర్యాదు చేసింది. కొంతకాలంగా తీగల త్రిషారెడ్డి తన యొక్క కొడుకు నందీశ్వర్ రెడ్డిని టార్చర్ చేస్తుందని, ఇన్స్టాలో మరియు ఇతర మాధ్యమాల్లో బ్లాక్ చేసినప్పటికీ, తన ఇంటికి వచ్చి అంగామ సృష్టించిందని ఇంట్లో అన్ని వస్తువులు ధ్వంసం చేసిందని ఆ యొక్క సీసీ ఫుటేజ్  కూడా మా వద్ద ఉందని ఫిర్యాదులో పేర్కొన్నది, తీగల ఫ్యామిలీ వల్ల తన కుమారుడికి ప్రాణహాని ఉందని మరియు వారి వల్ల తన కొడుకు ఢిల్లీలో ఉంటున్నాడని వారిపై చర్యలు తీసుకోవాలని మీర్పేట్ పోలీసులను ఆశ్రయించిన నాగ్ నందీశ్వర్ రెడ్డి తల్లి నిర్మల రెడ్డి.