ప్రభుత్వ ఉద్యోగులకు ట్రంప్ ఆఫర్
వాషింగ్టన్, జనవరి 29: ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించే దిశగా అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం కీలక ముందడుగు వేసిం ది. ప్రభుత్వం నుంచి వైదొలగాలనుకునే ఉద్యోగులే లక్ష్యంగా బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఫిబ్రవరి 6 లోగా తమ జాబ్‌ను స్వచ్ఛందంగా వదులుకునే ఫెడరల్ ఉద్యోగులకు బైఅవుట్ ఇవ్వనున్నట్టు మంగళవారం ప్రకటించింది.
ప్రభుత్వ ఉద్యోగుల ప్రమాణాలు, ప్రవర్తన, అనుకూలతలను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ మానవ వనరుల ఏజెన్సీతోపాటు ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ ఓ మెమో ద్వారా వెల్లడించింది. ఉద్యోగులు కార్యాలయానికి తప్పనిసరిగా రావాలని సూచించింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 6 నాటికి ఎవరైతే తమ ఉద్యోగాలను స్వచ్ఛందంగా వదులుకుంటారో వారికి ఏడు నెలల జీతాన్ని అందించనున్నట్టు తెలిపే మెయిల్స్ దాదాపు 20 లక్షల మంది ఉద్యోగులకు వెళ్లాయి.
దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ ప్రభుత్వ ఆఫర్‌ను సుమారు 10 శాతం మంది వినియోగించుకోవచ్చని భావిస్తున్న ట్టు ఎక్స్ ద్వారా పేర్కొన్నారు. ఇది విజయవంతంగా అమలైతే అమెరికా ప్రభుత్వ ఖర్చులు ఏటా 100 బిలియన్ డాలర్ల వర కూ తగ్గొచ్చని భావిస్తున్నట్టు పేర్కొన్నారు.
ప్యూ రీసెర్చి సెంటర్ ప్రకారం ఒక్కో ప్రభుత్వ ఉద్యోగి సగటున 12ఏళ్లపాటు పని చేస్తాడు. తాజాగా ట్రంప్ ఆఫర్‌ను కొంత మంది ఆమోదించినా ప్రభుత్వ పాలన, ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.