calender_icon.png 27 December, 2024 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భార్య కోసం వీఆర్‌ఎస్

26-12-2024 04:08:55 AM

  • పదవీ విరమణ ఫంక్షన్‌లోనే ఆమె మృతి
  • రాజస్థాన్‌లో విషాదం

జైపూర్, డిసెంబర్ 25: అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య బాగోగులు చూసుకునేందుకు ఓ భర్త తన ప్రభుత్వ ఉద్యోగానికి వీఆర్‌ఎస్ తీసుకున్నాడు. అయితే ఆయన పదవీ విరమణ ఫంక్షన్‌లోనే ఆమె మృతి చెందింది. రాజస్థాన్‌లోని కోటాకు చెందిన దేవేంద్ర సందాల్ కేంద్ర గిడ్డంగుల విభాగంలో పని చేస్తున్నాడు. ఆయన భార్య దీపిక గృహిణి. వారికి పిల్లలు లేదు. కొంతకాలంగా దీపిక  గుండె సంబంధ సమస్యలతో బాధపడుతోంది.

ఈ క్రమంలో ఆమె బాగో గులు చూసుకోవాలని దేవేంద్ర నిర్ణయించుకుని మూడేండ్ల సర్వీసు మిగి లి ఉండగానే వీఆర్‌ఎస్ తీసుకున్నాడు. ఈక్రమంలో ఆయనకు ఆఫీసు సిబ్బం ది పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు దీపిక కూడా హాజరయ్యారు.

దేవేంద్ర, దీపికలను కుర్చీలో కూర్చోబెట్టి ఉద్యోగులు సన్మానించారు. వారితో ఉద్యోగులు ఫొటోలు దిగుతూ ఉల్లాసంగా గడుపుతున్నారు. అయితే హఠాత్తుగా దీపిక కుర్చీలోనే కుప్పకూలిపోయింది. ఈ హఠాత్ పరిణామంతో భర్త పట్టుకోబోగా టేబుల్‌పై కూలిపోయింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు ప్రకటించారు. దీంతో దేవేంద్రతో పాటు అతని సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.