calender_icon.png 30 October, 2024 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘విస్తారా’ ఉద్యోగులకూ వీఆర్‌ఎస్

31-07-2024 02:58:28 AM

న్యూఢిల్లీ: టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ జాయింట్ వెంచర్ అయిన విస్తారా విమానయాన సంస్థ  ఉద్యోగులకు వాలెంటరీ రిటైర్మెంట్ స్కీమ్‌ను ప్రకటించింది. దీంతోపాటు వాలెంటరీ సెపరేషన్ స్కీమ్‌నూ తీసుకొచ్చింది. నాన్ ఫ్లయింగ్ స్టాఫ్‌కు దీన్ని వర్తింపజేయనుంది. ఎయిరిండియాతో విలీనం వేళ ఈ స్కీమ్‌లను ప్రకటించడం గమనార్హం. వీటికి దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 23 వరకు ఉద్యోగులకు అవకాశం ఇచ్చింది.విస్తారాలో పర్మినెంట్, కాంట్రాక్ట్ ఉద్యోగులు కలుపుకొని 6,500 మంది వరకు ఉంటారు.

వీరిలో ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న నాన్ ఫ్లయింగ్ పర్మినెంట్ స్టాఫ్‌కు వీఆర్‌ఎస్‌ను ప్రకటించారు.  పైలట్లు, క్యాబిన్ సిబ్బందిని మినహాయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై విస్తారా అధికారికంగా స్పందించలేదు. విలీనం వేళ ఎయిరిండియా ఈ నెలలోనే ఈ తరహా వీఆర్‌ఎస్‌ు ప్రకటించగా.. తాజాగా విస్తారా సైతం ఈ స్కీమ్‌ను ప్రకటించడం గమనార్హం.ఎయిరిండియా, విస్తారాలో కలిపి 23 వేల మంది ఉద్యోగులు ఉన్నారు.

ఈ రెండు సంస్థల విలీనం సుమారు 600 మంది నాన్ ఫ్లయింగ్ స్టాఫ్‌పై ప్రభావం పడనుందని తెలుస్తోంది. ఇలా ఉద్యోగం కోల్పోయిన వారికి ఎయిరిండియా గ్రూప్, టాటా కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. మరోవైపు విలీనం అనంతరం ఎయిరిండియా అతిపెద్ద విమానయాన సంస్థగా అవతరించనుంది. అందులో సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు  25.1 శాతం వాటా దఖలుపడనుంది ఇప్పటికే ఈ విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది.