హైదరాబాద్,(విజయక్రాంతి): మంత్రుల నివాసం వద్ద వీఆర్ఏలు ధర్నాకు దిగ్గారు. వీఆర్ఏల కుబుంబసభ్యులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ సమస్యలపై మంత్రివర్గ భేటీలో చర్చించాలని వీఆర్ఏలు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో 20,555 మంది తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలు ఉండేవారు. అందులో 16758 మందికి జీవో నంబర్ 81,85 ప్రకారం వారిని రెగ్యూలైజ్ చేసి వివిధ శాఖలకు కేటాయించారు. అదే జీవోలో ఉన్నటువంటి 3797 మంది వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఆందోళనకారులు వెల్లడించారు.
డిగ్రీ చదివినవారికి జూనియర్ అసిస్టెంట్ క్యాడర్, ఇంటర్ చదివివారికి రికార్డు అసిస్టెంట్ క్యాడర్, ఎస్ఎస్సీ వారికి ఆఫీస్ సబ్ ఆర్డినేటర్ క్యాడర్ కేటాయిస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఇదే అంశంపై గతంలో వీఆర్ఏలు 80 రోజులు చేసిన సమ్మెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తామకు న్యాయం చేస్తామని చెప్పారన్నారు. కానీ ఇప్పడు రేవంత్ రెడ్డి ఎందుకు తామ సమస్యను పరిష్కారించలేకపోతున్నారని ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు. జీవో వచ్చి కూడా రెండు సంవత్సరాలు గడిచిపోయిందని, వీఆర్ఏలోని కొంతమంది మరణించారని, వారికి వచ్చే రూ.10 వేల జీతంతో వారి కుటుంబ పోషణ ఎలా గడుస్తుందంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి వీఆర్ఏల కుటుంబాలకు న్యాయం చేయాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.