calender_icon.png 5 November, 2024 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో బెంచ్‌కు ఓటుకునోటు కేసు

05-11-2024 01:48:59 AM

విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ

న్యూఢిల్లీ, నవంబర్ 4 (విజయక్రాంతి): తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో సంచలనం రేపిన ‘ఓటుకు నోటు’ కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ తప్పుకున్నారు. దీంతో మరో బెంచ్ ముందుకు ఓటుకు నోటు కేసు విచారణకు రానుంది.

ఓటుకు నోటు కేసు నుంచి తనను తప్పించాలని జెరూసలేం మత్తయ్య అభ్యర్థనను తెలంగా ణ హైకోర్టు ఆమోదించింది. మత్త య్య పేరును కేసు నుంచి తొలగింపు తీర్పును సవాల్ చేస్తూ 2016 జూలై 6న తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీశ్‌చంద్రశర్మతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట సోమవారం విచారణకు వచ్చింది. తాను గతంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశానని, ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ సతీశ్ తెలిపారు. నాట్ బిఫోర్ మీ అని చెప్పడంతో ఈ పిటిషన్‌ను మరో బెంచ్ విచారణ చేపట్టనుంది.