calender_icon.png 27 January, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు మన హక్కు

26-01-2025 01:13:51 AM

15వ జాతీయ ఓటర్ల దినోత్సవంలో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి

మహబూబ్‌నగర్, జనవరి 25 (విజయక్రాంతి) : ఓటు హక్కు ప్రతి ఒక్కరు తమ జన్మ హక్కుగా భావించి 18న నిండిన వారందరూ నమోదు చేసుకొని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శనివారం 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని, ర్యాలీ నిర్వహించిన అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని సమావేశ మందిరంలో జాతీయ ఓటర్ దినోత్సవం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూఅన్నారు. జిల్లాలో  7 లక్షల 27 వేల మంది ఓటర్ లు నమోదు అయ్యారని, ఓటర్ నమోదు నిరంతర ప్రక్రియ అన్నారు. ఓటర్ నమోదు ప్రత్యేక క్యాంపెయిన్ లో బాగంగా 18-19 సంవత్సరంల మధ్య వయస్సు కలిగిన  15 వేల మంది ఓటర్లు ఉండగా, వీరిలో 3 వేల మంది కొత్తగా ఓటర్ గా కావడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నియమించుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదన కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్ రావు, అర్డిఓ నవీన్, అర్బన్ తహశీల్దార్ ఘన్సీ రాం తదితరులు పాల్గొన్నారు.