05-03-2025 02:40:22 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణలో ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మూడో రోజు కొనసాగుతోంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికకు సంబంధించిన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు బుధవారం కొనసాగుతుంది. ఎలిమినేషన్ ద్వారా ఇప్పటి వరకు పోటీ నుంచి 29 మంది తొలగిపోయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి నరేంద్ర రెడ్డి, మూడో స్థానంలో బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఉన్నారు.
తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తుది ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను ఎన్నికల సిబ్బంది లెక్కిస్తున్నారు. 29 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ అనంతరం మొత్తం అభ్యర్థుల ఓట్లులో బీజేపీకి - 75,923, బీఎస్పీకి- 60,343, కాంగ్రెస్ పార్టీకి - 70,750 ఓట్లు వచ్చాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ల ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్‌టీయూ నేత శ్రీపాల్ రెడ్డి గెలుపోందగా.. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీగా బీజేపీ బలపర్చిన మల్క కొమరయ్య విజయం సాధించారు.