- పురుషులు: 1,66,41,489 మంది
- మహిళలు: 1,68,67,735
- పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువ
- శేరిలింగంపల్లిలో అతి ఎక్కువగా 7,65,982
- భద్రాచలంలో అతితక్కువగా 1,54,134
- సీఈవో సుదర్శన్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్, జనవరి 6(విజయక్రాంతి ) : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభు త్వం సిద్ధం అవుతుండటంతో.. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా అన్ని ఏర్పా ట్లు చేస్తోంది. అందుకు తెలంగాణ లో సవరించిన ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. సవరణ తర్వాత తుది ఓటర్ల జాబితాను సీఈవో సుదర్శన్‌రెడ్డి సోమవారం ప్రకటించారు.
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో మొత్తం 3,35,27,925 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,66,41,489 మంది పురుషులు, 1,68,67,735 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 2,26,246 మంది ఎక్కువగా ఉన్నారు. థర్డ్ జెండర్స్ ఓటర్లు 2,829 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 18-19 సంవత్సరాల వయసుకు చెందిన వారు 5,45,026 మంది ఓటర్లు ఉన్నారు.
85 ఏళ్లు దాటిన సీనియర్ ఓటర్లు 2,22,091 మంది ఓటర్లు, ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 3,559 మంది, దివ్యాంగ ఓటర్లు 5,26,993 మంది ఓటర్లు ఉన్నారు. గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో మొత్తం ఓటర్లు ఇక అత్యధికంగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో అత్యధికంగా 7,65,982 మంది, అతి తక్కువగా భద్రాచలంలో 1,54,134 మంది ఓటర్లు ఉన్నారు.
ఇక గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 3,35, 12,053 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ స్టేషన్ల సంఖ్య కూడా పెరిగింది. సాధరాణ ఎన్నికల సమయంలో 19,356 పోలింగ్ స్టేష న్లు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 20,034 వరకు పెరిగింది. అదనంగా 678 పోలింగ్ స్టేషన్లు పెరిగాయి. వీటిలో అర్బర్ ఏరియాలో 6,123 పోలింగ్ స్టేషన్లు ఉండగా, రూరల్ ప్రాంతాల్లో 13, 911 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు సీఈవో వెల్లడించారు.