calender_icon.png 16 January, 2025 | 11:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేతలతో ఓటర్లు విసిగిపోయారు

18-12-2024 01:56:46 AM

జమిలితో ఒకేసారి ఎన్నికలు n మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

కోల్‌కతా, డిసెంబర్ 17: ఏటా ఓట్ల కోసం వచ్చే నేతలతో ఓటర్లు విసిగిపోయారని, తరుచూ అటువంటి పరిస్థితిని ప్రజలు కోరుకోవడం లేదని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. కోల్‌కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జమిలి ఎన్నికల ప్రతిపాదన అమలులోకి వస్తే ఎన్నికల భారం తగ్గి దేశాభివృద్ధి జరుగుతుందన్నారు. ఆర్థికాభివృద్ధికి జమిలి దోహదపడుతుంద న్నారు. జమిలి అమలులోకి వస్తే దేశంలో ఏదో ఒక చోట ఎన్నిక కోసం ఓటర్లు ఏటా పోలింగ్ బూత్‌లకు వెళ్లాల్సిన పని ఉండదన్నారు.

ప్రతి ఏటా ఎన్నికలు, ఉప ఎన్నికలు జరగడం వల్ల పోలింగ్ బూత్‌లకు వెళ్లేందుకు ఓటర్లు కూడా విముఖత చూపిస్తారని చెప్పా రు. జమిలి నివేదికపై మాట్లాడుతూ ఆ కమిటీ చైర్మన్‌గా అనేక మంది పార్టీల నాయకులు, ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం అయ్యామన్నారు. మొత్తం 18 వేల పేజీల నివేదికను అందరికీ అందుబాటులో ఉంచామన్నారు. ఒకే ఒక్క మౌజ్ క్లిక్‌తో వాటన్నింటిని ఇంట్లో నుంచే చదివే అవకాశం ఉందని ఆయన తెలిపారు.