calender_icon.png 25 October, 2024 | 6:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటరు నమోదుకు నవంబర్ 6వరకే అవకాశం

25-10-2024 04:32:09 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): అర్హులైన గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులందరూ తెలంగాణలో రానున్న గ్రాడ్యుయేషన్ ఎన్నికల కోసం ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అర్హులైన ఓటర్లు నవంబర్ 6వ తేదీ వరకు నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. ఇదిలా ఉండగా, రెండు కీలక ప్రాంతాలైన వరంగల్, ఖమ్మం, నల్గొండ, అలాగే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని ఉపాధ్యాయులు, అర్హులైన పట్టభద్రులు తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని చెప్పింది. అర్హులైన గ్రాడ్యుయేట్లు, ఉపాధ్యాయులందరూ రానున్న ఎన్నికల్లో పాల్గొనేందుకు నిర్ణీత గడువులోగా తమ రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేయాలని సూచించింది. ఈ అవకాశం ఓటర్లు తమ ప్రాతినిధ్యాన్ని, శాసనపరమైన విషయాలలో తమ గోంతుకను వినిపించేందుకు ఉపయోగపడుతుంది. మరిన్ని వివరాల కోసం, అర్హులైన నివాసితులు తమ జిల్లా ఎన్నికల కార్యాలయాలను లేదా తెలంగాణ ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌ https://ceotelangana.nic.in/ను సంప్రదించవచ్చు.