ఈ అవకాశాన్ని పట్టభద్రులు సద్వినియోగం చేసుకోవాలి
అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్రెడ్డి
కరీంనగర్, నవంబరు 23 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఎన్నికల కమిషన్ డిసెంబర్ 9 వరకు అవకాశం కల్పించిందని, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పరిధిలోని పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్రెడ్డి అన్నారు. శనివారం కరీంనగర్ పట్టణంలో పలువురు పట్టభ ద్రుల ను కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు తెలుపాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పట్టభద్రుడు అల్ఫోర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మిస్డ్కాల్ క్యాంపెయిన్ ద్వారా ఓటరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. 92400 21444 కు మిస్డ్ కాల్ చేస్తే తమ సిబ్బంది అందుబాటులోకి వచ్చి ఓటు నమోదుకు సహకరిస్తారని తెలిపారు.