calender_icon.png 20 March, 2025 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు తొలగింపులు సజావుగా చేయాలి

20-03-2025 12:00:00 AM

అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి 

మద్నూర్, మార్చి 19 : ఓటర్ల నమోదు మార్పులు చేర్పులు తొలగింపులు సజావుగా తప్పులు లేకుండా చేయాలని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా మద్నూర్ తాసిల్దార్ కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులతో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఓటర్ల నమోదు మార్పులు చేర్పులు వంటి వాటిపై అవగాహన కల్పించారు.

ఎన్నికల సంఘం గుర్తింపు కల్గిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాట్లాడారు.గుర్తింపు కార్డు కు ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ లింక్ చేసుకునే విధంగా అవగాహన కల్పించి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సమావేశంలో నియోజక వర్గ తహసీల్దార్ లు ఎం డి ముజీబ్ (మద్నూర్), భిక్షపతి(నిజాంసాగర్), దశరథ్ పెద్ద కోడప్గల్), సవాయి సింగ్ (మొహమ్మద్ నగర్), మహేందర్ కుమార్ (జుక్కల్), డోంగ్లి నాయబ్ తహసిల్దార్ శరత్ కుమార్, మద్నూర్ నాయబ్ తహసిల్దార్(ఎలక్షన్ సెక్షన్) శివ రామకృష్ణ, మండల గిర్దవర్ శంకర్, మరియు రాజకీయ పార్టీల ప్రతినిధులు బాలు షిండే (కాంగ్రెస్ పార్టీ), కృష్ణ పటేల్ (బీజేపీ పార్టీ), కే హన్మాండ్లు ( బి ఆర్ ఎస్ పార్టీ) ఈ రొహిదాస్ ( బీఎస్పీ పార్టీ) పాల్గొన్నారు.