ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న ఓటరు నమోదు ప్రక్రియను రాష్ట్ర ఆబ్జర్వర్ సురేంద్ర మోహన్ పరిశీలించారు. ఇందులో భాగంగానే జిల్లా కలెక్టర్ రాజర్షిషాతో కలిసి బుధవారం స్థానిక సంజయ్ నగర్ లోని పోలీస్ లైన్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటరు జాబితా ప్రక్రియని ఆబ్జర్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడి ఓటరు జాబితాకు సంబంధించిన పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. తప్పులు లేకుండా జాబితాను పకడ్బందీగా తయారు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా, ఆర్డీవో వినోద్ కుమార్ తో పాటు పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు.