71.47 శాతం పోలింగ్ నమోదు
అత్యధికం బాల్కొండలో 71.77 శాతం
అత్యల్పం నిజామాబాద్ అర్బన్ 57.86 శాతం
చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతం
నిజామాబాద్, మే 13 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ గ్రామీణ ప్రాంత ఓటర్లు ఓటెత్తారు. నియోజకవర్గ వ్యాప్తంగా ౭౧.౪౭ శాతం ఓటింగ్ నమోదైంది. బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా ౭౧.౭౧ శాతం, అత్యల్పంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ౫౭.౮౬ శాతం మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. చెదురుమొదురు ఘటనలు మినహా ఎలాంటి అవాంచనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. పార్లమెంటరి నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1808 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో మొత్తం 17,04,867 మంది ఓటర్లలో 67.96 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు
నిజామాబాద్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలతోపాటు జగిత్యాల జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ఈ పార్లమెంట్ నియోజకవర్గం విస్తరించి ఉంది. సాయంత్రం ౬ గంటల వరకు పోలింగ్ జరుగగా ౭౧.౪౭ శాతం పోలింగ్ నమోదయ్యింది. అత్యధికంగా బాల్కొండ నియోజకవర్గంలో 71.71 శాతం పోలింగ్ నమోదు కాగా, ఆ తర్వాతి స్థానాల్లో బోధన్ 70.84, నిజామాబాద్ రూరల్ 70.54, కోరుట్ల 70.07, ఆర్మూరు 69.61, జగిత్యాల 68.55 శాతం నమోదయ్యాయి. అత్యల్పంగా 57.86 శాతం నిజామాబాద్ అర్బన్‌లో నమోదయ్యింది.
గత పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని గంటపాటు పొడిగించడంతో పోలింగ్ మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. 2019 పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు పరధిలో 68.37 శాతం పోలింగ్ నమోదు కాగా, ఈసారి ౭౧.౪౭ శాతం నమోదయ్యింది. నిజామాబాద్, జగిత్యాల జిల్లా కేంద్రాలుగా ఉన్న నిజామాబాద్ అర్బన్, జగిత్యాల నియోజకవర్గాల్లో అత్యల్ప శాతం పోలింగ్ నమోదయ్యింది. ఈ లెక్కన ఓటు హక్కును వినియోగించుకోవడంలో పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతల ప్రజలు ముందంజలో ఉన్నారు.
పలు గ్రామాల్లో పోలింగ్ బహిష్కరణ
తమ గ్రామాల్లో సమస్యలు పరిష్కరించట్లేదని ఆరోపిస్తూ ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామ పరిధిలోని రాంసాగర్ తండా వాసులు ఓటింగ్‌ను బహిష్కరించారు. గ్రామానికి రోడ్డు సదుపాయం లేదని, ప్రభుత్వం బీటీ రోడ్డు వేయించాలని, ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని, అటవీ భూములకు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇప్పించాలని డిమాండ్ చేస్తు, ఓటింగ్ ను బహిష్కరించారు. నిజామాబాద్ అర్బన్‌లోని పోలింగ్ బూత్‌లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ముస్లిం మహిళలతో నఖాబ్ తీసి ఓటేయించాలని డిమాండ్ చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది.
బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ
ఈ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ జరిగిందని చెప్పవచ్చు. మోదీ మానియా వర్సెస్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన రాజ్యాంగం రద్దు, రిజర్వేషన్ల రద్దు లాంటి అంశాలు ప్రభావం చూపే అవకాశం ఉన్నది. గ్రామీణప్రాంత యువత, మధ్య తరగతిలో ఎక్కువ మంది మోదీవైపు చుడగా, దళిత సంఘా లు, క్రైస్తవ సంఘాలు, ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్ వైపు మొగ్గినట్టు తెలుస్తుంది. బీజేపీ లెవనెత్తిన కామన్ సివిల్ కోడ్, ముస్లిం రిజర్వేషన్ల రద్దు లాంటి అంశాలు ముస్లింలను కాంగ్రెస్ వైపు ఆకర్షించాయి.
మత ప్రాతిపాదిక రిజర్వేషన్లను రద్దుచేసి హిందువులకు రిజర్వేషన్లు పెం చుతామన్న హామీలు బీజేపీకి హిందూవర్గం ప్రజలను దగ్గరచేశాయి. రిజర్వేషన్ల తో పాటు ఇతర అంశాలపై బీజేపీ అభ్యర్థి అర్వింద్ అహంకారపూరిత ప్రకటనలు కొంత మేర నష్టం కలిగించాయని చర్చ జరుగుతుంది. బీఆర్‌ఎస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లోనూ చేదు అనుభవం తప్పేలా లేదని, గత ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బాజిరెడ్డిని వెంటాడుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది.