calender_icon.png 25 October, 2024 | 5:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హోమ్ ఓటింగ్‌ను పరిశీలించిన శశాంక

05-05-2024 01:01:28 AM

రంగారెడ్డి, మే 4 (విజయక్రాంతి) : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈసీ నిబంధన లు అనుసరించి హోమ్ ఓటింగ్ ప్రక్రియను కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక తెలిపారు. శనివారం రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని హైదర్ గూడ, అత్తాపూర్, వాసుదేవ్‌నగర్‌లో నిర్వహించిన హోమ్ ఓటింగ్ ప్రక్రియను ఆయన పర్యవేక్షించారు. పలువురు సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు కలెక్టర్ పర్యవేక్షణలో తమ ఓటును హక్కు ను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలోని ఏడు నియోజకవర్గ కేంద్రాల్లో హోమ్ ఓటింగ్ ప్రక్రియ ను అధికారుల పర్యవేక్షణలో సజావుగా కొనసాగుతుందని చెప్పారు. పార్లమెంట్ పరిధిలో మొత్తం 1115మంది ఓటర్లు ఓట్ ప్రమ్ హోమ్‌కు దరఖాస్తు చేసుకోగా అందులో 85 ఏండ్లకు పైబడిన వారు సిటిజన్లు 695మంది, 420 మంది దివ్యాంగులు ఉన్నారన్నారు. హోమ్ ఓటింగ్ ప్రక్రియలో 54బృందాలు పాల్గొంటున్నాయని ఆయన పేర్కొన్నారు.

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ

పార్లమెంట్ పరిధిలోని పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ను జాగ్రత్తగా నిర్వహించాలని ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక ఆదేశించారు. శనివారం రాజేంద్రనగర్ తాసీల్ కార్యాలయం ఆవరణలో పోస్టల్ బ్యాలెట్ ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని ఆయ న పరిశీలించారు. రెండో రోజు సెగ్మెం ట్ పరిధిలో పోస్టల్ బ్యాలెట్ సేకరణకు ఏర్పాట్లను ఆయన పరిశీలించి పోలింగ్, ఓటర్ రిజిస్ట్రేషన్లను తనిఖీ చేసి ఓటింగ్ సరళి వివరాలను అడిగి తెలుసుకున్నారు.