26-02-2025 01:48:10 AM
పొద్దుటూరు వినయ్‌రెడ్డి
ఆర్మూర్,25 ఫిబ్రవరి (విజయ క్రాంతి): కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో ఏం ఎల్ సి గా పట్టభద్రులు గెలిపించాలని ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ వినయ్ రెడ్డి కోరారు. ఆర్మూర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలో నిరుద్యోగులు అన్యాయానికి గురయ్యారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో 54 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు వివరించారు.
నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్లో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు, యువత, ప్రజల భవిష్యత్తు కోసం పని చేస్తుందని సృష్టం చేశారు.ఈ సమావేశంలో ఆర్మూర్ ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, వైస్ చైర్మన్ ఇట్టం జీవన్, గ్రంధాలయ మాజీ చైర్మన్ మారా చంద్రమోహన్, నాయకులు మోత్కూరి లింగా గౌడ్, అయ్యప్ప శ్రీనివాస్, పండిత్ పవన్ తదితరులు పాల్గొన్నారు.