calender_icon.png 26 October, 2024 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రాడ్యుయేట్ టీచర్లందరికీ ఓటు

26-10-2024 12:03:56 AM

  1. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి
  2. హైకోర్టులో పిల్ దాఖలు

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది.

యాదా్ర ది భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండ లం బండకాడిపల్లికి చెందిన ఎస్జీటీ బీమనబోయిన కృష్ణమూర్తి దాఖలు చేసిన పిల్‌ను శుక్ర వారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎల్ శ్రీనివాసరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.

రాబోయే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయా పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను ఓటర్లుగా పరిగణించేలా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోరారు. డిగ్రీ చేసినప్పటికీ వారికి ఓటు హక్కు కల్పించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు.

హైస్కూల్ టీచర్లతో సమానంగా పని చేస్తున్నారని, వాళ్లకు మాదిరిగానే ప్రైమరీ టీచర్లకు కూడా డిగ్రీ ఉన్నా ఓటు హక్కు కల్పించ కపోవడం వివక్ష కిందకే వస్తుందన్నారు. దీనిపై ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది స్పంది స్తూ, పిటిషనర్ చట్టంలోని నిబంధన 27(3) (బి) సెక్షన్‌ను సవాల్ చేయలేదన్నారు.  పిల్‌ను సవరించేందుకు అనుమతించాలని ప్రభాకర్ కోరారు.  దీనికి అనుమతిస్తూ ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది.