25-02-2025 07:14:50 PM
ఓయూ జేఏసీ నేత శ్రీకాంత్ యాదవ్..
కాటారం (విజయక్రాంతి): ఈనెల 27న జరగనున్న పట్టబద్రుల ఎన్నికల్లో నిరుద్యోగ సమస్యలపై చట్టసభల్లో ప్రశ్నించే వారికే ఓటు వేయాలని ఓయూ జేఏసీ నాయకులు ఆత్మకూరు శ్రీకాంత్ యాదవ్ పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును విద్యావంతులు, మేధావులు సరైన రీతిలో ఆలోచించి, ఓటు హక్కును సమాజ హితానికి ఉపయోగించాలని పిలుపునిచ్చారు.
నరేందర్ రెడ్డిని ఓడించాలని ప్రజాసంఘాల డిమాండ్..
కరీంనగర్, నిజామాబాద్, మెదక్ అదిలాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డిని ఓడించాలని ప్రజాసంఘాల నేతలు దయ్యం పోచయ్య, అక్కల బాపు, పీక కిరణ్ ఐత బాబు పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో అల్ఫోర్స్ ను మరిన్ని శాఖలుగా విస్తరింప చేసుకోవడం, స్వయం ప్రతిపత్తి విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసుకోవడానికి నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి నిలబడ్డారని వారు ఆరోపించారు.