కరీంనగర్, జనవరి28 (విజయక్రాంతి): ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధిగా తాను పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి ఎమ్మె ల్సీగా పోటీ చేస్తున్నాని రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డా వి. నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో పలువురు పట్టభద్రులను కలిసి రానున్న ఎన్నికల్లో తనకు మద్దతు పలకాలని కోరా రు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రా ధాన్యతగా తనకు మద్దతు తెలపాలని కోరా రు. తాను ఎమ్మెల్సీ గెలిస్తే విద్యారంగంలో నూతన ప్రమాణాలకై కషి చేస్తానని వెల్లడిం చారు.. ఉద్యోగ నిరుద్యోగ సమస్యలపై తన కు పూర్తిస్థాయిలో అవగాహన ఉందని..
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మండలి లో గలమెత్తుతానని వెల్లడించారు. ప్రైవేటు జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల యాజమా న్యాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కా రా నికి కషి చేస్తానని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.