ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియా జిఎం కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశంలో జి.యం కృష్ణయ్య మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియా ఆధ్వర్యంలో ఉపరితల గనుల పరిసర ప్రాంతల యువకులకు, భూనిర్వసితులకు, వారి పిల్లలకు వోల్వో డంప్ ట్రక్ ఆపరేటర్ గా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ దరఖాస్తుకై కనీస అర్హతలు 10వ తరగతి ఉత్తీర్ణులై 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలని, హెవీ గూడ్స్ వెహికల్ లైసెన్స్ నందు 3 సం.రాల అనుభవం కలిగి ఉండాలని, ఆసక్తి గల నిరుద్యోగ యువకులు ఇల్లందు ఏరియాలోని యం.వి.టి. కార్యాలయంలో సంబంధించిన పత్రాల జిరాక్స్ లు (విద్యఅర్హత, కుల ధృవీకరణ పత్రం, వయసు నిర్ధారణ, చిరునామా, హెవీ మోటార్ లైసెన్సు) జోడించి ఈ నెల 15.01.2025 లోపు ధరఖాస్తులు అందజేయగలరని తెలిపారు.