calender_icon.png 15 November, 2024 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యథేచ్ఛగా మట్టి దందా?

10-11-2024 12:18:00 AM

  1. అర్ధరాత్రి తరలిస్తున్న అక్రమార్కులు  
  2. పట్టించుకోని అధికారులు 
  3. ప్రభుత్వ ఆదాయానికి గండి 

వికారాబాద్, నవంబర్ 9 (విజయక్రాంతి): అక్రమార్కులు ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. యథేచ్ఛగా మట్టి తవ్వకాలతో కాసుల పంట పండించుకుంటున్నారు. వికారాబాద్ జిల్లాలో ఎర్రమట్టి దందా రోజురోజుకూ పెరిగిపోతోంది. అక్రమార్కులకు అధికారులు, నాయకుల అం డదండలు ఉండటంతో ఎర్రమట్టి దందా మూడు పూలు ఆరు కాయలుగా సాగుతోంది.

ఈ మధ్యకాలంలో ఆయా రాజకీయ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు మట్టి దందాతో సులువుగా డబ్బులు సంపాదించవచ్చనే ఉద్దేశంతో ఈ దారి ఎంచుకుంటున్నారు. ఈ దందా లో ఎలాంటి ఆటంకాలు రాకుం డా నాయకుల పుట్టిన, పెళ్లి రోజులకు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పా టు చేసి ఫలాన వారి తాలూకా అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా ఫ్లెక్సీల మాటున ఎర్రమట్టి దందా జోరుగా నడిపిస్తున్నారు.  

ఖజానాకు గండి 

మట్టి దందాతో జిల్లా ఖజానాకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతోంది. దందా చేసేవారు సంబంధిత శాఖ నుంచి ఎలాంటి అనుమతులు పొందకపోవడంతో పాటు రాయల్టీ చెల్లించకపోవడంతో ఆదాయానికి గండి పడుతోంది. ఎక్కడ ఎర్రమట్టి కనిపిస్తే అక్కడ గుట్టను మింగేస్తున్నారు. ఇలా ప్రతిరోజు జిల్లాలో వందల కొద్దీ లారీల ఎర్రమట్టి అక్రమ రవాణాకు గురవుతోంది.  

రాత్రుల్లో తరలిస్తూ..

జిల్లాలో ఇంటి నిర్మాణాలకు, వెంచర్లకు, ఇతర కట్టడాలకు అవసరమైన ఎర్రమట్టి తవ్వకం జోరుగా సాగుతోంది. కొందరు వ్యాపారులు అర్ధరాత్రి తవ్వకాలు జరిపి మట్టిని ఇతర ప్రాంతాలకు చేరవేస్తున్నారు. ఈ విషయం సంబంధిత అధికారులకు, పోలీసులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమార్కుల నుంచి ఆయా శాఖల అధికారులకు నెలనెలా ముడుపులు ముడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.