కీవ్: ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపుపై అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము యుద్ధం ఆపాలంటే నాటోలో చేర్చుకోవాలని జెలెన్ స్కీ కోరారు. ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో) ఉక్రెయిన్ సభ్యత్వ అభ్యర్థనను అంగీకరిస్తే రష్యాతో కాల్పుల విరమణ ఒప్పందం సాధ్యమవుతుందని జెలెన్‌స్కీ సూచించారు. రష్యా ఆక్రమించిన భూభాగాలను వాటికే వదిలేస్తామని పేర్కొన్నారు. వీలైనంత తర్వగా నాటోలో చేర్చుకోవాలని జెలెన్ స్కీ కోరారు. మిగిలిన భూభాగాన్ని దౌత్యపరంగా సాధించుకుంటామని శుక్రవారం నాడు ప్రచురించబడిన స్కై న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌లో "ప్రత్యేక సైనిక చర్య"కు ఆదేశించిన తర్వాత రెండు సంవత్సరాలకు పైగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతోంది.