calender_icon.png 23 January, 2025 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నీ

23-01-2025 01:04:42 AM

ఎస్పీ గోపతి సతీష్ వర్మ

కోహీర్, జనవరి 22: మండల కేంద్రమైన కోహీర్ పట్టణంలోని మెథడిస్ట్ చర్చి మైదానంలో గురువారం జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నీ నిర్వహిస్తున్నామని ఎస్పీ గోపతి సతీష్ వర్మ తెలిపారు. ప్రజల్లో ట్రాఫిక్, సైబర్ నేరాలు, డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించాలని ప్రధాన ఉద్దేశంతో టోర్నీ నిర్వహిస్తున్నామన్నారు.

విజేత జట్టుకు రూ. 10 వేలు , రన్నర్ టీమ్ కు రూ. 8 వేలు, మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 5 వేలు నగదు పురస్కారం అందచేస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు 8712656765, 9703629149 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.