లాస్ ఏంజెల్స్, డిసెంబర్ 24: అమెరికాలోని హవాయ్ ద్వీపంలోని కిలోవెయా అగ్నిపర్వతం మంగళవారం తెల్లవారుజామున బద్దలైంది. భూతలం నుంచి సుమారు 260 అడుగుల వరకు లావా ఎగసిపడింది. వోల్కనాలజిస్టులు దీనికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో విడు దల చేయగా, అవి కాస్తా వైరల్ అయ్యాయి. అగ్నిపర్వతం పగుళ్ల నుంచి సల్ఫర్ డయాక్సైడ్ విడుదలవుతోందని, వాతావరణంపై తీవ్ర ప్రభావం పడనున్నదని వోల్కనాలజిస్టులు అంచనా వేస్తున్నారు. వారి సూచన మేరకు స్థానిక అధికారులు అగ్నిపర్వత ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్న పౌరులు, జీవాలను సురక్షిత ప్రాం తాలకు తరలించారు.