* స్టాక్ సూచీల నష్టాల ముగింపు
ముంబై, డిసెంబర్ 24: వరుస నష్టాల నుంచి సోమవారం కోలుకున్న స్టాక్ మార్కె ట్ మంగళవారం తిరిగి నష్టాల్లో ముగిసింది. ట్రేడింగ్ ప్రారంభంలో స్టాక్ సూచీలు లాభాలతో ప్రారంభమైనప్పటికీ, రోజంతా ఒడి దుడుకులకు లోనయ్యాయి. బీఎస్‌ఈ సెన్సె క్స్ గ్యాప్‌అప్‌తో మొదలై 78,877 పాయిం ట్ల గరిష్ఠస్థాయికి చేరిన అనంతరం 78,397 కనిష్టస్థాయికి తగ్గింది. చివరకు 67 పాయిం ట్ల నష్టంతో 78,472 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇదేబాటలో 23,867 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు 25 పాయింట్లు కోల్పోయి 23,727 పాయింట్ల వద్ద నిలిచిం ది. సోమవారం సెన్సె క్స్ 498 పాయింట్లు, నిఫ్టీ 166 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. బుధవారం క్రిస్మస్ సెలవు నేపథ్యంలో ట్రేడింగ్ యాక్టివిటీ అంతంతమాత్రంగా ఉన్నదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. రూపాయి మరో కొత్త కనిష్టస్థాయిని తాకిన కారణంగా ఇన్వెస్టర్లలో జాగ్రత్త నెలకొన్నదన్నారు. తక్కువ ధరకు లభిస్తున్న ఎఫ్‌ఎంసీ జీ, ఆటోమొబైల్ షేర్లలో కొనుగోళ్లు జరగ్గా, పవర్, మెటల్ షేర్లను ఇన్వెస్టర్లు విక్రయించారని నాయర్ చెప్పారు.
అమ్మకాల బాటలోనే ఎఫ్‌పీఐలు
మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) అమ్మకాలు యథాతథంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ.3,4,54 కోట్ల విలువైన ఈక్విటీల ను నికరంగా విక్రయించినట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వరుసగా గత ఆరు రోజుల్లో ఎఫ్‌పీఐలు మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్న పెట్టుబడులు రూ. 15,200 కోట్లను మించాయి.
పవర్‌గ్రిడ్ టాప్ లూజర్
సెన్సెక్స్ ప్యాక్‌లో పవర్‌గ్రిడ్ అధికంగా 1.6 శాతం క్షీణించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టైటాన్, టాటా స్టీల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్‌లు 1.5 శాతం వరకూ తగ్గాయి. మరోవైపు టాటా మోటార్స్ ఐటీసీ, నెస్లే, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఎన్టీపీసీ, జొమాటోలు లాభపడ్డాయి. బీఎస్‌ఈలో ట్రేడ యిన షేర్లలో 2,019 స్టాక్స్ తగ్గగా, 1,977 షేర్లు లాభపడ్డాయి. వివిధ రంగా ల సూచీల్లో అధికంగా మెటల్ ఇండెక్స్ 0.93 శాతం తగ్గింది.
పవర్ ఇండెక్స్ 0.73 శాతం, యుటిలిటీస్ ఇండెక్స్ 0.52 శాతం, కన్జూమర్ డ్యూరబుల్స్ ఇండెక్స్ 0.50 శాతం, కమోడిటీస్ ఇండెక్స్ 0.33 శాతం చొప్పున తగ్గాయి. కన్జూమర్ డిస్క్రీషనరీ, ఎనర్జీ, హెల్త్‌కేర్, టెలికమ్యూనికేషన్, ఆటోమొబైల్, ఆయి ల్ అండ్ గ్యాస్, సర్వీసెస్ సూచీలు లాభపడ్డాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.37 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.09 శాతం చొప్పున పెరిగాయి.