హుజురాబాద్,(విజయక్రాంతి): దేశ ఆర్థిక సంస్కర్త నాటి పీవీ నేటికీ టీవీ అని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఓడితల ప్రణవ్ బాబు పివి సేవలను కొనియాడారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పీవీ నరసింహారావు 20 వర్ధంతి వేడుకను సోమవారంఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను, టెక్నాలజీ మొబైల్ రంగంలోప్రైవేటీకరణ చేసి దేశంలో వినూత్న మార్పు తీసుకొచ్చి దేశం అభివృద్ధి విషయంలో ఇతర దేశాలకు పోటి పడేలా చేసిన వ్యక్తి పీవీ నరసింహారావు అని ఆయన తీసుకున్న నిర్ణయాలే దేశానికి పట్టుకొమ్మలని అన్నారు.
బహుభాషా కోవిదుడుగా పేరుగాంచి కార్యకర్త స్థాయి నుండి ప్రధాని వరకు పనిచేసి కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవలు చేశారని,విద్యా వ్యవస్థలో నవోదయ పాఠశాలను నెలకొల్పి విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు తోడ్పాటును అందించారని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్లూరి విజయకుమార్, మాజీ పట్టణ అధ్యక్షుడు కాజీపేట శ్రీనివాస్, కొలిపాక శంకర్, మేకలా తిరుపతి, ఉప్పల శ్రీనివాస్, చందమల్ల బాబు, ప్రతాప నాగరాజు, మిరుదొడ్డి శ్రీనివాస్, తో పాడు తదితరులు పాల్గొన్నారు.