calender_icon.png 27 September, 2024 | 2:59 PM

వొడాఫోన్ ఐడియా రూ.30 వేల కోట్ల కాంట్రాక్టు

23-09-2024 12:00:00 AM

నెట్‌వర్క్ ఎక్విప్‌మెంట్ కోసం గ్లోబల్ కంపెనీలతో ఒప్పందం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22: దేశంలో మూడో పెద్ద టెలికాం సర్వీసుల కంపెనీ వొడాఫోన్ ఐడియా నెట్‌వర్క్ ఎక్విప్‌మెంట్ కోసం వచ్చే మూడేండ్లలో రూ.30,000 కోట్లు ఖర్చుచేయనుంది. ఇందుకోసం గ్లోబల్ ఎక్విప్‌మెంట్ కంపెనీలు నోకియా, ఎరిక్‌సన్, శాంసంగ్‌లకు కాంట్రాక్టులు ఇచ్చినట్లు వొడాఫోన్ ఐడియా ఆదివారం తెలి పింది. తమ ఖాతాదారులకు అత్యుత్తమ సర్వీసుల్ని అందించేందుకు కొత్త నెట్‌వర్క్ టెక్నాలజీల్లో పెట్టుబడి చేయడానికి కట్టుబడి ఉన్నామని వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ మూండ్రా తెలిపారు.

తమ సంస్థ తొలినాళ్ల నుంచి నోకియా, ఎరిక్‌సన్‌లతో ఉన్న తమ భాగస్వామ్యం ఇక ముందూ కొనసాగుతుందని, శాంసంగ్‌తో కొత్త భాగస్వామ్యాన్ని ప్రారంభించామని, 5జీ యుగంలోకి ప్రవేశించడానికి తమ భాగస్వాములతో కలిసి పనిచేస్తామని వివరించారు. రూ.30,000 కోట్ల 4జీ, 5జీ గేర్ ఎక్విప్‌మెంట్ కాంట్రాక్టు మూడు గ్లోబల్ కంపె నీలకు సమానంగా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇటీవల వొడాఫోన్ ఐడియా రెండు ఈక్విటీ ఇష్యూల ద్వారా సమీకరించిన రూ. 24,000 కోట్ల నిధుల నుంచి ఎక్విప్‌మెంట్‌కు వ్యయపరుస్తుంది.