calender_icon.png 1 March, 2025 | 2:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త ఉపాధ్యాయులకు వృత్తి బోధన శిక్షణ

28-02-2025 10:55:24 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో 2025 డిఎస్సికి ఎంపికైన కొత్త ఉపాధ్యాయులకు వృత్తి బోధన నైపుణ్య శిక్షణ తరగతులను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిక్షణలో కొత్తగా ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి విద్యా బోధనపై అవగాహన పెంచేందుకు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రామారావు తెలిపారు. పట్టణంలోని పంచశీల కళాశాలలో ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ట్రైనర్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.