calender_icon.png 1 March, 2025 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డోంట్ వర్రీ... వార్ వన్ సైడ్ - గెలుపు మనదే

01-03-2025 07:48:33 PM

సంబరాలకు సిద్ధం కండి... కాంగ్రెస్ శ్రేణులకు విఎన్ఆర్ పిలుపు..

గెలుపుపై నరేందర్ రెడ్డి భరోసా...

కరీంనగర్ (విజయక్రాంతి): ఈనెల 27న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ జరిగిందని.. గెలుపు కాంగ్రెస్ పార్టీ దేనని, కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. కార్యకర్తలతో సరదాగా చాయ్ తాగుతూ చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు నుండే తన ప్రచారం ఉమ్మడి నాలుగు జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోని ఉద్యోగ, నిరుద్యోగ పట్టబద్రులను ప్రత్యక్షంగా కలిసి తాను ఎమ్మెల్సీగా గెలిస్తే ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తానో చెప్పడం జరిగిందని.. వారంతా తన అభ్యర్థనను నిన్న జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత వేశారని రేపటి కౌంటింగ్ లో తాను మొదటి ప్రాధాన్యత ఓటుతోనే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.

గతంలో ఎన్నడూ లేనంతగా శాతం పెరిగిందని.. బిజెపి బీఎస్పీ పార్టీల అభ్యర్థులు సోషల్ మీడియా వేదికగా తనపై చేసిన ఆరోపణలను, విష ప్రచారాన్ని పట్టభద్రులు నమ్మలేదని ఓటరు సైలెంట్ గాఓటు వేసి తన పని తాను చేసుకొని వెళ్లాడని తన గెలుపును జీర్ణించుకోలేని వారే ఓడిపోతున్నాడని, మూడో స్థానానికి వెళుతున్నాడని గ్లోబల్ ప్రచారానికి తెర లేపారని మండిపడ్డారు.