05-03-2025 06:54:41 PM
చైనాకు చెందిన మెబైల్ తయారీ సంస్థ వీవో టీ4 సిరీస్ లో తొలి వీవో టీ4ఎక్స్ ఫోన్ ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ అమ్మకాలు మార్చి 12 నుంచి ప్రారంభం కానున్నాయి. తాజగా కంపెనీ మరికొన్ని ఫీచర్లు, కలర్ వేరియంట్లను కూడా అధికారికంగా రివీల్ చేసింది.50 ఎంపీ కెమెరా, 6500 ఎంఎహెచ్ బ్యాటరీతో బడ్జెట్ ధరలో తీసుకురావడం విశేషం. వీవో టీ4 సిరీస్ ను మూడు వేరియంట్లలో వినియోగదారులకు పరిచయం చేసింది. 6 జీబీ + 128 జీబీ వేరియంట్ ధర రూ.13999, 8 జీబీ + 128 జీబీ వేరియంట్ ధర రూ.14,999, 8 జీబీ + 256 జీబీ వేరియంట్ ధర రూ.16,999గా సంస్థ పేర్కొంది. కలర్ వేరియంట్లు: పర్పుల్, బ్లూ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
వీవో టీ4ఎక్స్ ఫీచర్లు:
6.72 అంగుళాల స్క్రీన్ పుల్ హెచ్డీ-ఎల్సీడీ డిస్ ప్టే, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, వెనుకవైపు డ్యుయల్ కెమెరా సెటప్ లో 50 మెగాపిక్సెల్ ఏఐ ప్రధాన కెమెరా, 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ గా ఉండనుంది. బ్యాటరీ సామర్థ్యం 6500 ఎంఏహెచ్. 44W ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.ఐపీ 64 రేటింగ్, యూఎస్బీ 2.0 పోర్ట్ తో వస్తోంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 15 ఫన్ టచ్ ఓఎస్ 15 ఆధారంగా పని చేస్తుంది.